క్రిటికల్ కేర్ నెఫ్రాలజీపై అంతర్జాతీయ సదస్సు
వైద్య రంగంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ఆధునిక చికిత్సా పద్ధతులు, నూతన ఆవిష్కరణలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు అంతర్జాతీయ వైద్య సదస్సులు వేదికగా నిలుస్తాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు.
- యశోద దవాఖానలో ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): వైద్య రంగంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ఆధునిక చికిత్సా పద్ధతులు, నూతన ఆవిష్కరణలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు అంతర్జాతీయ వైద్య సదస్సులు వేదికగా నిలుస్తాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. క్రిటికల్ కేర్ నెఫ్రాలజీపై యశోద దవాఖానలో ఏర్పాటు చేసిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును శనివారం ఆమె ప్రారంభించారు.
అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. ఈ సదస్సును నిర్వహిస్తున్న యశోద దవాఖాన యాజమాన్యాన్ని అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 85 కోట్ల మంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ చికిత్సా విధానాల గురించి విసృ్తతంగా చర్చించేదుకు అంతర్జాతీయ వైద్య నిపుణులు ఉత్సాహంగా ముందుకు రావడం హర్షణీయమని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి పేర్కొన్నారు. వెయ్యి మందికిపైగా యువ ఇంటెన్సివిస్ట్‌లు, అనస్థీషియన్లు, సర్జన్లు, నెఫ్రాలజిస్టులు ఈ సదస్సుకు హాజరైనట్టు ‘యశోద’ సీనియర్ నెఫ్రాలజిస్టు డాక్టర్ రాజశేఖర చక్రవర్తి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

