హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేదర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏవోయూ) 27వ స్నాతకోత్సవంలో 10 మంది ఖైదీలు పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టాలు పొందారు. బుధవారం గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై వారికి పట్టాలు ప్రదానం చేశారు.
10 మంది ఖైదీల్లో 8 మంది ఎంఎస్సీ (సైకాలజీ), మరో ఇద్దరు ఎంఏ (సోషియాలజీ) కోర్సులను పూర్తి చేశారు. పట్టాలు అందుకున్న ఖైదీలను జైళ్ల శాఖ డీఐజీ డీ శ్రీనివాస్, సెంట్రల్ ప్రిజన్ చర్లపల్లి సూపరింటెండెంట్ జీ ప్రమోద్ అభినందించారు.