అనాథ పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటది : మంత్రి సత్యవతి
మంత్రి సత్యవతి | కొవిడ్ బారిన పడి తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లలు అనాథలు కాకుండా ప్రభుత్వం వారి బాధ్యతలు తీసుకుంటది

ములుగు : కొవిడ్ బారిన పడి తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లలు అనాథలు కాకుండా ప్రభుత్వం వారి బాధ్యతలు తీసుకుంటది. అధికారులు ఇలాంటి పిల్లల విషయంలో చాలా మానవత్వంతో వ్యవహరించి, వారిని సంరక్షించాలని గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కొవిడ్ వల్ల ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోవద్దని సీఎం కే సీఆర్ లాక్ డౌన్ విధించారని, ప్రభుత్వ హాస్పిటళ్లలో అన్ని వసతులు కల్పిస్తున్నారని చెప్పారు.
ఏటూరు నాగారం ఐటీడీఏలో కొవిడ్, ధాన్యం కొనుగోలు, విత్తనాలు, ఎరువుల పంపిణీపై మంత్రి సమీక్ష నిర్వహించారు. గత ఏడాది కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించడం వల్ల ఆర్థికంగా రాష్ట్రం మీద భారం పడిందని, ఈసారి లాక్ డౌన్ విధించ కూడదని భావించారు.
కానీ ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని సీఎం లాక్ డౌన్ విధించి, కఠినంగా అమలు చేస్తున్నారని, ప్రజలంతా దీనికి సహకరించాలని ఆమె కోరారు. లాక్ డౌన్ తర్వాత కొవిడ్ కేసులు బాగా తగ్గుతున్నాయని, కొవిడ్ బారిన పడ్డవారికి ప్రాణాపాయం లేకుండా చేపట్టిన వసతులు ఫలితాలు ఇస్తున్నాయన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫీవర్ సర్వే నిర్వహించడం ద్వారా కొవిడ్ లక్షణాలున్న వారిని ముందే గుర్తించి వారికి తగిన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. సీరియస్ గా ఉన్నవారిని హాస్పిటల్స్ లో చేర్పించి, వారికి ఆక్సిజన్ అందిస్తూ వారు కోలుకునేలా అన్ని చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ధాన్యం కొనుగోలు కోసం సీఎం ఆలోచన మేరకు అధికారులు గోనె సంచులు, రవాణా వసతి సరిగా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సకాలంలో కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. రోహిణి కార్తె ప్రవేశించగానే మళ్లీ రైతులకు కావల్సిన విత్తనాలు, ఎరువులు అందించాలని, దీనికి సంబంధించి స్టాక్ నిర్వహించుకోవాలన్నారు.
సమావేశంలో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ప్రాజెక్టు అధికారి హన్మంతు జెండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

