Minister Vemula | మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండను బంగారు కొండగా మార్చారు : ప్రభుత్వ విప్ బాల్క సుమన్
Minister Vemula | బాల్కొండ నియోజకవర్గాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి బంగారు కొండగా మార్చారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్( Balka Suman) కొనియాడారు. మారుమూల ప్రాంతాలకు సైతం డబుల్ రోడ్లు వేసిన ఘనత ప్రశాంత్ రెడ్డి( Minister Vemula)కే దక్కిందన్నారు. ఇంత మంచి మనసున్న నాయకుడు దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని పేర్కొన్నారు.
నిజామాబాద్ : బాల్కొండ నియోజకవర్గాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి బంగారు కొండగా మార్చారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్( Balka Suman) కొనియాడారు. మారుమూల ప్రాంతాలకు సైతం డబుల్ రోడ్లు వేసిన ఘనత ప్రశాంత్ రెడ్డి( Minister Vemula)కే దక్కిందన్నారు. ఇంత మంచి మనసున్న నాయకుడు దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గురువారం తాళ్ళరాంపూర్ గ్రామంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ..తనకు 31 గ్రామాలతో ఉన్న మండలాన్ని చేయడానికి నాలుగేండ్లు పట్టిందని కానీ, ప్రశాంత్ రెడ్డి ఏడు గ్రామాలతో ఏర్గట్ల మండలాన్ని ఏర్పాటు చేసి, ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ప్రతి పక్షాల డిపాజిట్లు గల్లంతే అని 70 నుంచి 80వేల మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి హ్యాట్రిక్ గెలుపు ఖాయమయ్యిందని, కార్యకర్తలు కొంచెం గట్టిగా కష్ట పడితే లక్ష మెజారిటీ తథ్యమన్నారు. కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిన ప్రతి గడపకు వెళ్లి ఓటు అడగాలని కార్యకర్తలకు సూచించారు.
మంత్రి వేముల మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులే నా బలం..బలగం అని అన్నారు.
కార్యకర్తలే తనకు ఎల్లప్పుడూ వెన్నంటి నిలిచారన్నారు. ఎవరు అడగకున్నా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి, గ్రామాలకు డబుల్ రోడ్లు వేశానని తెలిపారు. గ్రౌండ్ లెవల్ బాగుందని, మెజారిటీ కోసమే తాపత్రయమని, ప్రతిపక్ష పార్టిల్లో ఉన్నా కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన వారిని సైతం ఓట్లు అడిగి వేయించే ప్రయత్నం చేయాలని సూచించారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టో పై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ప్రతి కార్యకర్త ఒక కేసీఆర్, ఒక ప్రశాంత్ రెడ్డి కావాలన్నారు. రైతు బంధు,దళిత బంధు ఆపాలని ఈసీకి లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా విస్తృత స్థాయి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

