Rythu Runa Mafi | రుణమాఫీకి ఎన్సీడీసీ రుణం.. భారీ మొత్తంలో రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపని జాతీయ బ్యాంకులు!
రైతు రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జాతీయ బ్యాం కులతో రుణాల గురించి చర్చలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
Rythu Runa Mafi | హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జాతీయ బ్యాం కులతో రుణాల గురించి చర్చలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. భారీ మొత్తంలో రుణం ఇచ్చేందుకు జాతీయ బ్యాంకులు ఆసక్తి చూపడంలేదని సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ)ని సంప్రదించినట్టు తెలిసింది. రుణం ఇచ్చేందుకు తమ సంస్థ షరతులు, కేంద్ర ప్రభుత్వ అనుమతులను ఎన్సీడీసీ అధికారులు వివరించిన ట్టు తెలిసింది.
ఎన్సీడీసీ కేంద్ర సహకార శాఖ అధీనంలో ఉంటుంది. ఈ సంస్థ రుణం ఇవ్వాలంటే కేంద్ర సహకార శాఖ అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం కేంద్ర సహకార శాఖ మంత్రిగా బీజేపీ అగ్రనేత అమిత్‌షా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎన్సీడీసీ రుణం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్టు తెలిసింది. నాలుగు రోజులపాటు ఢిల్లీలో మకాం వేసిన రేవంత్‌రెడ్డి.. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలతోపాటు రుణమాఫీకి అవసరమైన రుణం పొందేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని పలువురు కేంద్ర మంత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.
ప్రభుత్వానికి ఒయాసిస్‌లా ఎన్సీడీసీ
రుణమాఫీకి నిధుల వేటలో భాగంగా ముంబై వెళ్లిన అధికారులు ఆర్బీఐ అధికారులతో చర్చించినట్టు తెలిసింది. ఢిల్లీలో పలు జాతీయ బ్యాంకుల అధికారులతోనూ చర్చించినట్టు సమాచారం. అయితే ఆ బ్యాంకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎడారిలో ఒయాసిస్ మాదిరిగా ప్రభుత్వానికి ఎన్సీడీసీ కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీలో ఎన్సీడీసీ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి, రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను, రుణ అనివార్యతను వారికి వివరించినట్టు తెలిసింది. ఎక్కువ మొత్తంలో రుణం ఇవ్వాలని ఎన్సీడీసీని కోరినట్టు తెలిసింది. ఈ రుణం వస్తుందనే ఆశతోనే ప్రభుత్వ పెద్దలు రుణమాఫీపై ప్రకటనలు చేస్తున్నట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

