రాష్ట్రంలో వేరుశనగ పంట సాగుకు ప్రాధాన్యం: మంత్రి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్ రెడ్డి| రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా వేరు శనగకు డిమాండ్ ఉందని చెప్పారు. ఈ నేపథ్యంల రాష్ట్రంలో వేరుశనగ పంట సాగును పెంచుతామని వెల్లడించారు.

నల్లగొండ: రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా వేరు శనగకు డిమాండ్ ఉందని చెప్పారు. ఈ నేపథ్యంల రాష్ట్రంలో వేరుశనగ పంట సాగును పెంచుతామని వెల్లడించారు. నల్లగొండ పర్యటనలో భాగంగా చిట్యాలలోని రైతు సత్తిరెడ్డి పొలంలో వంకాయ పంటసాగును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3లక్షల 75 వేల ఎకరాల్లో పంట సాగవుతున్నదని చెప్పారు. త్వరలో సాగు విస్తీర్ణాన్ని 6 లక్షల ఎకరాలకు పెంచుతామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థులకు పల్లీ పట్టీలు అందించేందుకు ఆమోదం తెలిపిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యార్థులకు పల్లి పట్టీలు అందిస్తామని చెప్పారు. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో పల్లీ పంటకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. దేశంలో అత్యధికంగా గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం పల్లీ పంటను సాగు చేయబోతున్నదని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pains | నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కువ కాలం పాటు నొప్పి ఉంటే ఏం జరుగుతుంది..?
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

