Government Hospitals | రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్
Government Hospitals | రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. అయితే అత్యవసర సేవలు, ఇన్‌పేషెంట్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నట్లు సమాచారం.
Government Hospitals | రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీ ప్రక్రియలో ప్రభుత్వం జీవో నెం.38 నిబంధనలను తుంగలో తొక్కుతూ ఏకపక్షంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీజీడీఏ) బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రి సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ వైద్య సేవలను నిలిపివేశారు. అయితే అత్యవసర సేవలు, ఇన్‌పేషెంట్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నట్లు సమాచారం.
G.O. 38 అమలు చేయాలని డిమాండ్
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.38 ప్రకారం బదిలీలు జరగకపోవడంపై డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్పౌజ్ కోటాలో దరఖాస్తు చేసుకున్న వారికి, అనారోగ్య సమస్యలు ఉండి ప్రాధాన్యత కోరుతున్న వారికి న్యాయం జరగడం లేదని టీజీజీడీఏ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏల్లుగా మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తూ.. వ్యక్తిగత కారణాలతో బదిలీలు కోరుతున్న వైద్యుల వినతిని అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. గుర్తింపు పొందిన సంఘం నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలనే నిబంధనను కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు.
జీవో 38లో ఏముంది?
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో జీవో 38 జారీ చేసింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను నిర్దేశించింది. దీని ప్రకారం రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తావులేకుండా నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ జీవో ప్రకారం సీనియారిటీ, తప్పనిసరి బదిలీ ప్రమాణాలు, స్పౌజ్ క్రైటేరియా వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ వాటిని సక్రమంగా అమలు చేయడం లేదని టీజీజీడీఏ నాయకులు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

