24 గంటల్లోనే బకాయిలువిడుదల
సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్ మంత్రి హరీశ్ చర్చలు జరిపిన మరుసటిరోజే రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు శుభవార్త అందింది. ప్రొఫెసర్ల బదిలీలు, యూజీసీ బకాయిలను విడుదల చేస్తామని వైద్య సంఘాల ప్రతినిధులకు శుక్రవారం హామీ ఇచ్చిన మంత్రి హరీశ్ దాన్ని శనివారమే నెరవేర్చి మాట నిలబెట్టుకొన్నారు.
- సమస్యల పరిష్కారానికి శుక్రవారం
- హరీశ్ వైద్యసంఘాల విజ్ఞప్తి
- యూజీసీ బకాయిల కోసం వినతి
- మరునాడే ఎరియర్స్ విడుదల
- ప్రొఫెసర్ల బదిలీలకు కూడా ఓకే
- తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ
- సీఎం, మంత్రికి వైద్యుల కృతజ్ఞతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్ మంత్రి హరీశ్ చర్చలు జరిపిన మరుసటిరోజే రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు శుభవార్త అందింది. ప్రొఫెసర్ల బదిలీలు, యూజీసీ బకాయిలను విడుదల చేస్తామని వైద్య సంఘాల ప్రతినిధులకు శుక్రవారం హామీ ఇచ్చిన మంత్రి హరీశ్ దాన్ని శనివారమే నెరవేర్చి మాట నిలబెట్టుకొన్నారు. ఈ మేరకు యూజీసీ ఎరియర్స్ విడుదల చేస్తున్నట్టు తెలంగాణ సర్కారు ప్రకటించింది. డీఎంఏ పరిధిలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల బదిలీకి కూడా పచ్చ జెండా ఊపింది. నెలలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాపీలను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ వైద్య సంఘాల ప్రతినిధులకు స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. భారీగా బడ్జెట్ కేటాయించి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు వైద్య సిబ్బందికి లోటు రాకుండా చూసుకుంటున్నారని చెప్పారు. మరోవైపు వైద్యారోగ్యశాఖ పరిధిలో భారీగా నియామకాలు చేపడుతున్నట్టు చెప్పారు. టీఎస్ ద్వారా 1,479 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేశామని గుర్తు చేశారు. పీజీ డాక్టర్లను డీహెచ్, టీవీవీపీ నుంచి డీఎంఈ వైపు తీసుకున్నామని చెప్పారు. ఇలా ఐదేండ్లలో 688 మందిని తీసుకున్నట్టు తెలిపారు. 761 వైద్యులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లుగా, 545 మంది అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా, 31 మందికి అడిషనల్ డైరెక్టర్లుగా ప్రమోషన్ ఇచ్చామని వివరించారు.
ఏడేండ్ల సర్వీసుకే ప్రొఫెసర్ పదోన్నతి
సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుచేస్తున్నామని, ఇప్పటికే 26 మెడికల్ కాలేజీలు వచ్చాయని, కొత్త పోస్టులు క్రియేట్ అయ్యాయని మంత్రి హరీశ్ వెల్లడించారు. తద్వారా త్వరగా ప్రమోషన్లు పొందుతున్నారని చెప్పారు. ఒకప్పుడు 20 ఏండ్ల సర్వీస్ తర్వాత ప్రొఫెసర్ ప్రమోషన్లు వచ్చేవని, ఇప్పుడు ఏడేండ్ల సర్వీసు నిండిన వెంటనే ప్రొఫెసర్ పదోన్నతి పొందుతున్నట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కొందరు అసిస్టెంట్, మరికొందరు అసోసియేట్ ప్రొఫెసర్లుగా రిటైర్డ్ అవుతున్నారని గుర్తుచేశారు. టీచింగ్ ఫ్యాకల్టీ వయస్సు 61 నుంచి 65 ఏండ్లకు పెంచామని తెలిపారు. ఎరియర్స్ విడుదలతోపాటు బదిలీల ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా వైద్య సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ వైద్యుల సంఘం సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
మంత్రి హరీశ్ టీటీజీడీఏ సన్మానం
పీఆర్సీ బకాయిలు, బదిలీ ఉత్తర్వులను ఒకే రోజున విడుదల చేయడంపై తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ హర్షం ప్రకటించింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ సహకరించిన టీఎస్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డీఎంఈ డాక్టర్ల అందరి తరపున అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. మంత్రి హరీశ్ అసోసియేషన్ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అన్వర్, డాక్టర్ జలగం తిరుపతిరావు, ఉపాధ్యక్షుడు కిరణ్ మాదల, కోశాధికారి కిరణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

