TSRTC | విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సుల ఛార్జీలు తగ్గింపు..!
TSRTC | హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు.
TSRTC | హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ప్రారంభ ఆఫర్ కింద ఈ-గరుడ బస్సుల ఛార్జీలను తగ్గించినట్లు తెలిపారు. ఈ ఆఫర్ నెల రోజుల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. మియాపూర్ – విజయవాడ ఛార్జీ రూ. 830 నుంచి రూ. 760కి, ఎంజీబీఎస్ – విజయవాడ ఛార్జీ రూ. 780 నుంచి రూ. 720కి తగ్గించినట్లు పేర్కొన్నారు.
మంగళవారం హైదరాబాద్ మియాపూర్‌లో 10 ఈ -గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోగా హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపనున్నారు. 20 నిమిషాలకో ఈ-గరుడ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. హైదరాబాద్ నగరం నుంచి నిత్యం 50 వేల మంది విజయవాడ, రాజమండ్రికి ప్రయాణిస్తున్నారని, అందుకే తొలుత ఈ-గరుడ బస్సులను విజయవాడకు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

