TSRTC | విజయవాడ రూట్లో 10 శాతం రాయితీ.. సూపర్ లగ్జరీ, రాజధాని సర్వీసుల్లో వర్తింపు
TSRTC | హైదరాబాద్ : ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు హైదరాబాద్-విజయవాడ రూట్లో 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఆ రూట్లో నడిచే సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో రానుపోనూ ఈ రాయితీ వర్తించనుంది. ఈ నెల 30 వరకు 10 శాతం డిస్కౌంట్ అమల్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.
TSRTC | హైదరాబాద్ : ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు హైదరాబాద్-విజయవాడ రూట్లో 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఆ రూట్లో నడిచే సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో రానుపోనూ ఈ రాయితీ వర్తించనుంది. ఈ నెల 30 వరకు 10 శాతం డిస్కౌంట్ అమల్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.
విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. విజయవాడ వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలనుకుంటే.. ఆయన టికెట్లో విజయవాడ వరకు 10 శాతం రాయితీ కల్పించడం జరుగుతుంది. ఆ రాయితీ వల్ల ఒక్కో ప్రయాణికుడికి రూ.40 నుంచి 50 వరకు ఆదా అవుతుంది. ఈ నెల 30వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలి అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్సైట్ www.tsrtconline.com ను సంప్రదించాలని వారు సూచించారు.
అలాగే ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ రాయితీ కల్పిస్తోందని గుర్తు చేశారు. 31 నుంచి 44 రోజుల మధ్యలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే 5 శాతం, 45 నుంచి 60 రోజుల మధ్యలో రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 23450033 ను సంప్రదించాలన్నారు.
ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్-విజయవాడ రూట్లో 10 శాతం రాయితీని #TSRTC కల్పిస్తోంది. ఆ మార్గంలో వెళ్లే సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో రానుపోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ నెల ౩౦ వరకు 10 శాతం డిస్కౌంట్ అమల్లో ఉంటుంది. ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.40 నుంచి 50 వరకు ఆదా… pic.twitter.com/017vjug8T0
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) April 13, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

