రూ.1.65 లక్షలకు పుత్తడి
బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చక్కబడుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వరుసగా మూడోరోజూ బంగారం ధరలు భారీగా పెరిగాయి.
న్యూఢిల్లీ, మే 20: బంగారం ధరలు మళ్లీ ప్రియమవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చక్కబడుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వరుసగా మూడోరోజూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,300 ఎగబాకి రూ.1.65 లక్షలకు చేరువైంది. అంతకుముందు ఇది రూ.1,63,600గా ఉన్నది.
యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ మరింత బలోపేతం అయినప్పటికీ గోల్డ్ ధరలు పుంజుకోవడం విశేషమని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. కానీ, వెండి ధరలు భారీగా పడిపోయాయి. వరుసగా రెండోరోజూ కిలో వెండి రూ.5 వేలు తగ్గి రూ.2.66 లక్షలకు దిగొచ్చింది. వరుసగా రెండు రోజుల్లో వెండి రూ.10 వేలు దిగొచ్చినట్టు అయింది. పారిశ్రామిక వర్గాలు, పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌నకు మొగ్గుచూపడంతో వెండి ధరలు దిగొస్తున్నాయని బులియన్ వర్తకులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,483.54 డాలర్లకు చేరుకోగా, వెండి 75.42 డాలర్లకు చేరుకున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Business news
- gold
- India
- Sliver
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

