Bhadrachalam | భద్రాచలం మళ్లీ గోదావరి ఉధృతి.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. రాష్ట్రంతో పాటుగా ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన నీటి మట్టం, శనివారం తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 51.3 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది.
భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. రాష్ట్రంతో పాటుగా ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన నీటి మట్టం, శనివారం తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 51.3 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు. నీటిమట్టం 53 అడుగుల వరకు పెరగవచ్చని తెలిపారు. అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ, లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
కాగా, గోదవారి ఉధృతితో దుమ్ముగూడెం, పర్ణశాల వద్ద గోదావరి నీటిమట్టం 25 అడుగులు దాటింది. దీంతో భద్రాచలం, దుమ్ముగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సున్నంబట్టి రోడ్డుపైకి గోదావరి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాచలంలోని ఏఎంసీ కాలనీ శివారులో ఇండ్లలోకి వరద నీరు చేరింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

