హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ సూళ్లలో జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ (జీఎన్ఎం) కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలిపింది. దరఖాస్తులను డౌన్లోడ్ చేశాక వాటిని ప్రభుత్వ సూళ్లలో ఈ నెల 19లోపు, ప్రైవేట్ సూళ్లలో అక్టోబర్ 10లోపు సమర్పించాలని వివరించింది.
అక్టోబర్ 4 నాటికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. అక్టోబర్ 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్టు పేర్కొన్నది. వివరాలకు dme. telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది.