హైదరాబాదీ లక్క గాజులు.. తాండూరు పప్పుకు జీఐ గుర్తింపు!
తెలంగాణకు చెందిన మరో రెండు ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు లభించే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ర్టానికి చెందిన 15 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు రాగా, హైదరాబాద్ లక్క గాజులు, తాండూరు రెడ్ గ్రామ్‌కు గుర్తింపు కోసం అవసరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి
- ఎంపికకు ఆన్లైన్ పోలింగ్
- రాష్ట్రం నుంచి ఇప్పటికే దరఖాస్తు
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన మరో రెండు ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు లభించే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ర్టానికి చెందిన 15 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు రాగా, హైదరాబాద్ లక్క గాజులు, తాండూరు రెడ్ గ్రామ్‌కు గుర్తింపు కోసం అవసరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుర్తింపు దక్కితే ఈ రెండు ఉత్పత్తులకు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ లభించే వీలు కలుగుతుంది.
హైదరాబాద్ లక్క గాజులకు సంబంధించిన దరఖాస్తును ఇటీవలే సమర్పించారు. తాండూరు రెడ్ గ్రామ్ దరఖాస్తు జీఐ వద్ద పరిశీలనలో ఉన్నది. మరో ఆరు నెలల్లో దీనికి జీఐ గుర్తింపు లభించే వీలున్నది. పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, సిద్దిపేట గొల్లభామ, చేర్యాల పెయింటింగ్స్, వరంగల్ డర్రీస్, తేలియా రుమాల్, నారాయణపేట చేనేత చీరలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, ఆదిలాబాద్ డోక్రా, నిర్మల్ టాయ్స్, క్రాఫ్ట్స్, హైదరాబాదీ హలీం, బంగినపల్లి మామిడిపండ్లకు ఇప్పటికే జీఐ గుర్తింపు లభించింది. స్వతంత్ర భారత వజ్రోవత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలు అత్యధికంగా ఇష్టపడే జీఐ ఉత్పత్తిని ఎంపికచేసేందుకు ఆన్లైన్ పోలింగ్‌ను చేపట్టింది. దీనివల్ల జీఐ ఉత్పత్తులకు ప్రచారం లభించడంతోపాటు ప్రజల్లో సైతం వీటిపై మరింత చైతన్యం కలిగే అవకాశం ఉన్నది. ipindiaservices.gov.in/girpoll వెబ్సైట్ ద్వారా పోలింగ్‌లో పాల్గొనవచ్చు. పోలింగ్‌కు అక్టోబర్ రెండు చివరి తేదీ. దీని ఆధారంగా అత్యధికంగా ఇష్టపడుతున్న జీఐ ఉత్పత్తిని ఎంపిక
చేస్తారు.
జీఐ అంటే..
జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది ఒక గుర్తు, చిహ్నం. ప్రత్యేక భౌగోళిక స్థానం నుంచి వచ్చే ఉత్పత్తికి ఉపయోగించే పేరు. గొప్ప పేరు, తరతరాలుగా తిరస్కరించలేని చారిత్రక వారసత్వంతో ప్రత్యేక, నిర్దిష్ట లక్షణాన్ని కలిగి ఉన్న వస్తువులకు ఈ గుర్తింపు ఇస్తారు. సహజ ఉత్పత్తి, హస్తకళ, ఆహార పదార్థాలు, తయారుచేసిన ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తి ఇలా అనేక వస్తువులకు ఈ గుర్తింపు లభిస్తుంది. గత 15 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 920 కిపైగా వస్తువులకు దరఖాస్తులు చేసుకోగా, 400లకుపైగా ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించింది.
డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఆధ్వర్యంలో ఈ గుర్తింపు ఇస్తారు. చెన్నైలో జీఐ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. జీఐ గుర్తింపుతో డార్జిలింగ్ టీ, పాష్మినా షాల్, కన్నౌజ్ పెర్ఫ్యూమ్, పోచంపల్లి ఇక్కత్ తదితర వాటికి అంతర్జాతీయ మార్కెట్ లభించింది. ఏ రెండు ఉత్పత్తులు ఒకేలా ఉండకుండా చూడడమే జీఐ గుర్తింపు విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

