Bio Asia 2023 | ఇక సూది గుచ్చకుండానే వైద్య పరీక్షలు
Bio Asia 2023 | సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్ స్క్రీనింగ్ డివైజ్ పరికరంతో రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను సులువుగా గుర్తించవచ్చని ప్రముఖ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆర్కా ల్యాబ్ సీఈవో గాయత్రి తెలిపారు.
Bio Asia 2023 | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్ స్క్రీనింగ్ డివైజ్ పరికరంతో రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను సులువుగా గుర్తించవచ్చని ప్రముఖ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆర్కా ల్యాబ్ సీఈవో గాయత్రి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో డివైజ్ తయారీ, వీటి వినియోగానికి అవసరమైన సాంకేతికతను బెంగళూరు కేంద్రంగా అందిస్తున్నట్టు చెప్పారు.
నిలబడిన చోటే ముఖ కవళికలను కెమెరా రికార్డు చేసి వాటిని ఎనలైజ్ చేసేందుకు రూపొందించిన సాఫ్ట్వేర్ సాయంతో బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులను గుర్తించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని కిమ్స్తోపాటు మరికొన్ని సెంటర్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు క్లినిక్ల ద్వారా ఈ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 4వేల మందికి థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వైద్య పరీక్షలు చేయగా 91 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నూతన డివైజ్ ద్వారా వ్యాధి నిర్ధారణ ఖర్చు భారీగా తగ్గుతుందని, రూ.100-150 లోపే హెల్త్ రిపోర్టు పొందవచ్చని ఆమె వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

