రంగారెడ్డి: జిల్లాలోని మొయినాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్‌లో ఉన్న హార్స్ రైడింగ్ క్లబ్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్లో ఉన్న యువతీయువకులు గంజాయి సేవించినట్లు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద 20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. క్లబ్ నిర్వాహకులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.