Telangana | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. 14 నుంచి 24 వరకు గాంధీ చిత్రం ప్రదర్శన
Telangana | భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీ నుండి 24 వరకు రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Telangana | హైదరాబాద్ : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీ నుండి 24 వరకు రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విద్యార్థులలో జాతీయ స్పూర్తిని పెంపొందించే విధంగా వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా గాంధీ చిత్రాన్నిసీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉచితంగా ప్రదర్శించగా, లక్షలాది మంది విద్యార్ధులు వీక్షించినట్లు వివరించారు. విద్యార్థులను థియేటర్ల వద్దకు ఉచితంగా తీసుకెళ్ళి క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు.
వజ్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా కూడా గాంధీ జీవిత చరిత్రను తెలియజేసే గాంధీ చిత్రాన్ని కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు కూడా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 14వ తేదీన ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని తెలిపారు. మళ్లీ 16 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1.30 గంటలకు వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని వివరించారు. థియేటర్ల నిర్వహకులు, విద్యాశాఖ, రవాణా శాఖ, పోలీసు శాఖ, సమాచార శాఖ అధికారులు సమన్వయంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

