Gaddam Vivek | తెలంగాణలో అత్యంత సంపన్న ఎమ్మెల్యే గడ్డం వివేక్..
Gaddam Vivek | తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 114 మంది ఎమ్మెల్యేల ఆస్తులు కోటికి పైగానే ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఈ 114 మంది ఎమ్మెల్యేల్లో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా గడ్డం వివేక్(కాంగ్రెస్) నిలిచారని ఏడీఆర్ తేల్చింది. 2018 ఎన్నికల్లో 106 మంది కోటీశ్వరులుగా ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 114కు చేరింది.
Gaddam Vivek | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 114 మంది ఎమ్మెల్యేల ఆస్తులు కోటికి పైగానే ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఈ 114 మంది ఎమ్మెల్యేల్లో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా గడ్డం వివేక్(కాంగ్రెస్) నిలిచారని ఏడీఆర్ తేల్చింది. 2018 ఎన్నికల్లో 106 మంది కోటీశ్వరులుగా ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 114కు చేరింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 60 మంది, బీఆర్ఎస్ నుంచి 38 మంది, బీజేపీ నుంచి 8 మంది, సీపీఐ నుంచి ఒకరు, ఎంఐఎం నుంచి గెలిచిన ఏడుగురు కూడా కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు.
చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ రూ. 606 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. మునుగోడు నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. 458 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, పాలేరు నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ. 433 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు రూ. 24 లక్షలతో అతి తక్కువ ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేగా నమోదు అయ్యారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నేనావత్ రూ. 28 లక్షలు, అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ జాడే రూ. 56 లక్షలను కలిగి ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఇక ఐటీఆర్ చెల్లిస్తున్న వారిలో ప్రథమస్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రెండో స్థానంలో గడ్డం వివేక్, మూడో స్థానంలో కేటీఆర్ ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల ఆఫిడవిట్ ఆధారంగా ఏడీఆర్ ఈ రిపోర్టును విడుదల చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

