హైదరాబాద్ : ప్రజలతా పెంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అనే మొక్కను కొందరు నరకడానికి చూస్తున్నారని అన్న వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్(Gadari Kishore Kumar) ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి అబద్ధాలాడి, పనికిరాని ఉపాయాలు వేసిన జిత్తులమారి నక్క(Cunning fox) అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తా అన్నాడు. కొన్ని రోజుల తర్వాత లెక్కలు చేస్తున్నాం టైం కావాలి అన్నాడు.
మళ్లీ కొన్ని రోజుల తర్వాత ఎన్నికల కోడ్ అన్నాడు. ఇప్పుడు ఆగస్టు 15న చేస్తానని అంటున్నాడు, అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వస్తే అప్పుడు చెయ్యడని విమర్శించారు. ఒకసారేమో రేవంత్ రెడ్డి నేను పేదవాడిని అని అంటాడు. ఇంకోసారి మా అయ్యా పోలీస్ పటేల్, మా ఇంటి ముందు నుంచి ఎవరు చెప్పులు వేసుకొని కూడా నడువరి అంటాడు. రేవంత్ రెడ్డి ఇంతకీ నువ్వు ఏంది నీకైనా క్లారిటీ ఉందా? అని సూటిగా ప్రశ్నించారు.