Free Uniforms | వచ్చే ఏడాది 24 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున ఉచిత యూనిఫారాలు
వచ్చే విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫారాలను ఉచితంగా అందజేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024 -25 విద్యాసంవత్సరానికి అధికారులు ఇండెంట్‌ను రూపొందించి..
- వచ్చే విద్యాసంవత్సరానికి రెండు జతల చొప్పున అందజేత
- టెస్కోకు ఇండెంట్ సమర్పించిన విద్యాశాఖ
Free Uniforms | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : వచ్చే విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫారాలను ఉచితంగా అందజేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024 -25 విద్యాసంవత్సరానికి అధికారులు ఇండెంట్‌ను రూపొందించి.. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ (టెస్కో)కు సమర్పించారు. యూనిఫారాల కోసం రూ. 150 కోట్ల నిధులను ఖర్చు చేయనుండగా, 1.4 కోట్ల మీటర్లకు పైగా వస్త్రాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేస్తారు. ఈ వస్ర్తాన్ని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు (ఎస్ఎంసీ) అందజేసి, స్థానికంగా ఉండే దర్జీలు, టైలర్ల ద్వారా కుట్టించి అందజేస్తారు. వీటిలో కొంత భాగాన్ని మహిళా సంఘాలకు అప్పగిస్తారు. ఒక్కో యూనిఫాంకు రూ.50 కుట్టుకూలీ చెల్లిస్తారు.
ఇంటర్ వరకు ఒకే కలర్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఒకే కలర్ యూనిఫారాలు అందజేస్తారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు పాఠశాలలు, కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, మాడల్ స్కూళ్లు, గురుకులాలు, గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు యూనిఫారాలు అందుతాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

