బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్స్‌కు ఉచిత శిక్షణ
Free Coaching | తెలంగాణ రాష్ట్ర బీసీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆలోక్‌కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీసీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆలోక్‌కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందిన వారిలో 182 మంది గ్రూప్ 1 మెయిన్స్‌కు అర్హత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.
అదే సమయంలో మెయిన్స్‌కు కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వరంగల్, ఖమ్మం స్టడీ సర్కిళ్లలో 100 చొప్పున, హైదరాబాద్ స్టడీ సర్కిల్లో 200 మందికి మొత్తంగా 400 మందికి మెయిన్ పరీక్షకు శిక్షణకు ఇవ్వనున్నట్లు తెలిపారు. బీసీ స్టడీ స్టడి సర్కిళ్లలో శిక్షణ పొంది మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి ప్రియారిటీ ఉంటుందని వెల్లడించారు.
అదేవిధంగా మెయిన్స్‌కు అర్హత సాధించిన ఆసక్తి ఉన్న అభ్యర్థులు సైతం స్టడీ సర్కిళ్లలో దరఖాస్తు చేసుకోవాలని మెరిట్ ఆధారంగా శిక్షణ ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ఉచిత శిక్షణతో పాటు నెలకు రూ.5వేల చొప్పున మూడునెలల పాటు ఉపకారవేతనం సైతం అందివ్వనున్నామని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

