Srisailam | నాలుగో యూనిట్‌ను సిద్ధం చేయాలి.. శ్రీశైలం విద్యుత్ కేంద్రం అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను త్వరితగతిన సిద్ధం చేసి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను త్వరితగతిన సిద్ధం చేసి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైడల్ ప్రాజెక్టును ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వీ, మాజీ సీఎంజీ హెచ్ అశోక్ కుమార్, హైడల్ డెరెక్టర్ వెంకట్రాజన్, సీఎంజీ హెచ్ఆర్ అజయ్‌తో కలిసి విద్యుత్ కేంద్రం సర్వీస్ బేలో పర్యటించారు. నాలుగో యూనిట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పొయిన అమరులకు నివాళులు అర్పించారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోపభూయిష్టమైన సాంకేతికతో రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చే నష్టాన్ని వివరించి ఎలాంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కిందిస్థాయి ఉద్యోగుల నుంచి సీఈవో వరకు ఒకే కుటుంబంలా సమష్టి కృషి చేసి త్వరితగతిన నాల్గో యూనిట్‌ను సిద్ధం చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలని సూచించారు. అనంతరం కాన్ఫ్రెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. నాల్గో యూనిట్ పునరుద్ధరణకు కావాల్సిన రూ.2కోట్ల అంచనా వ్యయాన్ని మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 2006లో రికార్డు స్థాయిలో 26వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసిన విధంగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని కోరారు. సమావేశంలో పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలల ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుల్ల రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, తుడి మేఘారెడ్డితోపాటు సంస్థ సీఈ సూర్యనారాయణ, ఎస్ఈ ఆదినారాయణ పాల్గొని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

