పట్టణాలన్నీ పరిశుభ్రం
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, విద్యుత్తు సరఫరాను మెరుగుపర్చే సదుద్దేశంతో ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి. క్రీడా ప్రాంగణాలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 3 నుంచి ప్రారంభించిన నాలుగో విడతలో భాగంగా 142 నగర పాలక సంస్థలు
4వ విడత పట్టణ ప్రగతి విజయవంతం
ఇప్పటిదాకా విడుదలైన నిధులు 3,318 కోట్లు
పూర్తయిన పనుల విలువ 2,649 కోట్లు
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, విద్యుత్తు సరఫరాను మెరుగుపర్చే సదుద్దేశంతో ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి. క్రీడా ప్రాంగణాలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 3 నుంచి ప్రారంభించిన నాలుగో విడతలో భాగంగా 142 నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా, శనివారం ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పట్టణ ప్రగతి కింద ప్రభుత్వం రూ.3,318 కోట్లు విడుదల చేయగా, ఇప్పటికే రూ.2,649 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి.
పట్టణ ప్రగతికి రూ.3,318 కోట్లు
- రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీతో కలిపి మొత్తం 142 పట్టణ ప్రాంతాల్లో ఉన్న 3,618 వార్డుల్లో దాదాపు కోటి 50 లక్షల జనాభా నివసిస్తున్నది. పురపాలక సంస్థల వార్షిక బడ్జెట్లో 10% నిధులను గ్రీన్ బడ్జెట్‌గా కేటాయిస్తున్నారు.
- 2020 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు, 2021 జూన్ 1 నుంచి 8 వరకు, 2021 జూలై 1 నుంచి 10 వరకు మూడు విడతల్లో జరిగిన పట్టణ ప్రగతి విజయవంతమైంది.
- పురపాలక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు 2020 ఫిబ్రవరి నుంచి 2021 మార్చి వరకు ప్రభుత్వం ప్రతి నెల రూ.148 కోట్ల చొప్పున విడుదల చేసింది. 2021 ఏప్రిల్ నుంచి రూ.112 కోట్లు ఇచ్చింది. పట్టణ ప్రగతి ప్రారంభించినప్పటి నుంచి పురపాలక సంస్థలకు విడుదల చేసిన మొత్తం రూ. 3,318 కోట్లు.
- దేశంలో ఎకువ పట్టణీకరణ జరిగిన మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ చోటు దక్కించుకొన్నది.
- పట్టణప్రగతితో రాష్ట్ర నగరాలు, పట్టణాలు దేశంలోనే అత్యంత నివాసయోగ్య ప్రాంతాలుగా మారుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

