Siddipet | సిద్దిపేటలో కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం
Siddipet | సిద్దిపేట (Siddipet) జిల్లా దౌల్తాబాద్ (Doulthabad) మండల కేంద్రంలో అపహరణకు గురైన నాలుగేండ్ల చిన్నారి ఆచూకీ లభ్యమైంది.
Siddipet | సిద్దిపేట (Siddipet) జిల్లా దౌల్తాబాద్ (Doulthabad) మండల కేంద్రంలో అపహరణకు గురైన నాలుగేండ్ల చిన్నారి ఆచూకీ లభ్యమైంది. చిన్నారిని అపహరించిన (kidna) దంపతులను పోలీసులు (Police) సోమవారం ఉదయం హైదరాబాద్‌లో గుర్తించి.. చిన్నారిని సురక్షితంగా రక్షించారు.
దౌల్తాబాద్‌కు చెందిన బర్ల మమత, ప్రభాకర్ దంపతుల నాలుగేండ్ల కుమార్తె బర్ల శైలజ ఆదివారం ఉదయం తాత ఎల్లయ్యతో కలిసి కిరాణా దుకాణానికి వెళ్లింది. అక్కడ ఎల్లయ్య సరకులు తీసుకునే పనిలో చిన్నారిని గమనించలేదు. పనిపూర్తైన తర్వాత చూడగా అక్కడ పాప కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన ఎల్లయ్య చుట్టుపక్కల అంతా వెతికినా పాపా ఆచూకీ లభించలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
చిన్నారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు కిరాణా దుకాణం సమీపంలోని సీసీకెమెరాలను పరిశీలించగా దంపతులు పాప చెయ్యి పట్టుకొని స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వరకు వెళ్తున్నట్లు కనిపించింది. అక్కడి నుంచి గజ్వేల్ పట్టణానికి, ఆ తరువాత హైదరాబాద్ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. ఈ క్రమంలో దంపతులను సోమవారం ఉదయం హైదరాబాద్‌లో గుర్తించి చిన్నారిని సురక్షితంగా రక్షించారు.
Also Read..
Anand Mahindra | ఆ సినిమా తీయాలని రాజమౌళికి ఆనంద్ మహీంద్రా సూచన.. దర్శకధీరుడి రిప్లై ఇదీ
Musi River | మూసీ నదికి పోటెత్తిన వరద.. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం
CM KCR | మహోన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లు : సీఎం కేసీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
Surprise Inspections | కొత్తగూడెంలో తూనికలు, కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు
Indian Railways | దీపావళి వేళ దక్షిణ మధ్య రైల్వే అలర్ట్.. వీటిని రైళ్లలో అస్సలు తీసుకురావద్దంటూ రిక్వెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

