గ్యాంగ్ రేప్ కేసులో మహిళ సహా నలుగురికి 20 ఏండ్ల జైలు
కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంచలన తీర్పు
కరీంనగర్ కోర్టు చౌరస్తా, అక్టోబర్ 9: ఎస్టీ మహిళపై గ్యాంగ్‌రేప్ కేసులో నిందితులకు 20 ఏండ్ల జైలు, రూ.11వేల చొప్పున జరిమానా విధిస్తూ కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నీరజ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలానికి చెందిన మహిళ తన బంధువుల సహకారంతో కాట్నపల్లిలోని ఒక మిల్లులో కూలీగా పనిచేస్తున్నది. అక్కడే లేబర్లు ఉండే గదుల్లో తన ఐదేండ్ల కూతురుతో కలిసి ఉంటున్నది. గది పక్కనే ఉన్న షేక్ సఖియా బేగంతో పరిచయం ఏర్పడింది. బేగం వద్దకు తరుచూ వచ్చే గుండెబోయిన శంకర్ మిల్లులకు హమాలీలను సప్లయ్ చేస్తుంటాడు.
2017 మార్చి 10న సఖియా బేగం బాధిత మహిళను సుల్తానాబాద్‌కు వెళ్లి కూరగాయలు తెచ్చుకుందామని నమ్మించి న్యాతరి స్వామి ఆటోలో శంకర్, హమాలీ సంజయ్కుమార్యాదవ్తో కలిసి వెళ్లారు. తిరిగి కాట్నపల్లి శివారులోని రైస్ మిల్లు వద్దకు రాగానే ముగ్గురు మహిళపై సామూహిక లైంగికదాడి జరిపారు. బాధిత మహిళ ఫిర్యాదుమేరకు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదుచేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితులు శంకర్, స్వామి, సంజయ్‌కుమార్‌తోపాటు సహకరించిన సఖియా బేగంకు 20 ఏండ్ల జైలు, 11 వేల చొప్పున జరిమానాతోపాటు నిందితులు రూ.4 లక్షలు బాధితురాలికి చెల్లించాలని తీర్పునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

