నిజామాబాద్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం
Nizamabad | నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న కారు ముక్పాల్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న కారు ముక్పాల్ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ఉన్నారని, మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

