వైద్య ఆరోగ్యశాఖలో అక్రమ కారుణ్య నియామకం !
నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన అక్రమ కారుణ్య నియామకంపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేర కు నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేయగా.. మెడికల్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న చామకూరి వెంకటేశ్వర్లు 2025 మే 31న ఉద్యోగ విరమణ పొందాడు. కిడ్నీల సమస్యతో బాధపడుతూ 2025 నవంబర్ 26న సూర్యాపేటలో మరణించాడు.
నీలగిరి, నవంబర్ 5: నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన అక్రమ కారుణ్య నియామకంపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేర కు నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేయగా.. మెడికల్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న చామకూరి వెంకటేశ్వర్లు 2025 మే 31న ఉద్యోగ విరమణ పొందాడు. కిడ్నీల సమస్యతో బాధపడుతూ 2025 నవంబర్ 26న సూర్యాపేటలో మరణించాడు.
విరమణపొందిన వ్యక్తి మరణిస్తే కారుణ్య నియామకం వర్తించదన్న ఉద్దేశంతో కుటుంబసభ్యులు విరమణ కన్నా మూడు రోజులముందే మరణించినట్టు తప్పుడు రికార్డులు సృష్టించి అక్రమ మార్గంలో ఆయన కుమారుడు చామకూర రాజు ఉద్యోగం పొందాడు. ఈ విషయమై ఎస్సైలు ముత్తయ్య, సైదులు, వెంకట్‌నారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. గురువారం మృతుడి భార్య వసంత, మరణ ధ్రువీకరణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి సతీశ్ (12వ బెటాలియన్), సపోర్టర్‌గా ఉన్న చైతన్యపురి కాలనీ వాసి నకిరేకంటి సైదులు, నకిరేకంటి అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేశారు. తప్పుడు మరణ ధృవీకరణ పత్రాల వ్యవహారంలో శాలిగౌరారం మెడికల్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

