గురువారం 28 మే 2020
Telangana - May 07, 2020 , 14:53:41

మత్తడి దుంకుతున్న చెరువులు..ఆనందంలో అన్నదాతలు

మత్తడి దుంకుతున్న చెరువులు..ఆనందంలో అన్నదాతలు

హైదరాబాద్‌ : నీళ్లు, నియామకాలు, నిధుల సాధనే లక్ష్యంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్టం సీఎం కేసీఆర్‌ సారథ్యంలో గమ్యం వైపు వడివడిగా పరుగులు పెడుతున్నది. సీఎం కన్న కలలు సాకారమవుతున్నాయి.సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నంతో గోదారమ్మను తెలంగాణలోని బీడు భూములకు మళ్లిస్తుండడంతో రైతులు పసిడి సిరులు పండిస్తున్నారు. గోదారమ్మ రైతన్నల పాదాలను తాకుతుండడంతో వారు ఆనందంతో తడిసిముద్దవుతున్నారు. కాగా సిద్దిపేటలోని రంగనాయక సాగర్ నుంచి గోదావరి జలాలు గ్రామాల్లోని చెరువు, కుంటలకు చేరుకుంటున్నాయి.ఇటీవలే రంగనాయక సాగర్ నుంచి కాలువలకు నీళ్లు వదిలిన విషయం తెలిసిందే.

చిన్నకోడూరు మండలం  మాచాపూర్లోని చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నయి. గ్రామంలోని రైతులు, ప్రజా ప్రతినిధులు చెరువుల్లోకి వచ్చిన నీటిని చూసి మురిసిపోయారు.ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ సంబర పడిపోయారు.టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, గ్రామస్తులతో కలిసి జలాలకు పుష్పాభిషేకం చేశారు.  కొబ్బరికాయలు కొట్టి మాకు మంచి రోజులు వచ్చాయని సీఎం కేసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.సాగు నీళ్లు అందించిన సీఎం కు రైతాంగం రుణ పడి ఉంటుందన్నారు.
logo