అబద్ధాలు మాట్లాడితే చెప్పు దెబ్బలే.. కాంగ్రెస్ అభ్యర్థికి వార్నింగ్ ఇచ్చిన మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత
Sujatha | ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంటున్నది. ఆ పార్టీ నేతలు ఒకరిపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. తాజాగా అదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలో దుమారం చెలరేగుతున్నది.
ఆదిలాబాద్ : జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ(Congress)లో వర్గపోరు తారస్థాయికి చేరుకుంటున్నది. ఆ పార్టీ నేతలు ఒకరిపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. తాజాగా అదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలో దుమారం చెలరేగుతున్నది. అమెరికా నుండి వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డి( Kandhi Srinivas Reddy) అనే మూర్ఖుడు తమపై లేనిపోని అసత్య ఆరోపణలు మానుకోవాలని మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత(Former TPCC general secretary Sujatha), మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థి అల్లూరి సంజీవ్ రెడ్డి హెచ్చరించారు.
ఇటీవల కంది శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో భాగంగా చేసిన వ్యక్తిగత ఆరోపణలు, అనుచిత పదజాలంతో దూషించడంపై వారు మీడియాతో మాట్లాడారు. అనంతరం కంది తీరుపై ఎలక్షన్ కమీషన్‌కు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని కంది ఒక బజారు రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఓట్లు రాబ ట్టుకోవాలని నీచమైన కుట్ర పన్నుతున్నాడని, ప్రజలకు తామెలాంటి వారిమో తెలుసన్నారు. కోట్లు పెట్టి కొనుక్కున్న టికెట్‌తో మదమెక్కి మాట్లాడుతున్న కంది శ్రీనివాస్‌రెడ్డికి దమ్ముంటే ఆ ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. ఒక మహిళ అని చూడకుండా శూర్పణఖ అంటూ, బూతులతో అసభ్య పదజాలంతో దూషించడం సిగ్గుచేటని అన్నారు.
గండ్రత్ సుజాత గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన మహిళగా ప్రజల్లో ఎంతో అభిమానాన్ని పొందిన ఆమెను ఎన్నికల్లో అమ్ముడుపోయారని అసత్య ఆరోపణలు చేయడం కంది దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరినామని ఇలాంటి వారికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

