Satyanarayana | మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కన్నుమూత.. హరీశ్‌రావు దిగ్భ్రాంతి
మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ (Satyanarayana) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ (Satyanarayana) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం సంగారెడ్డిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, టీజీపీఎస్సీ సభ్యుడిగా పనిచేశారు. 2007లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2008లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. టీఎస్పీస్సీ సభ్యుడిగా పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మృతిపట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిస్టుగా, ఎమ్మెల్సీగా, టీజీపీఎస్సీ సభ్యుడిగా తనదైన ముద్రవేశారన్నారు. బీఆర్ఎస్కు ఆయన సేవలు చిరస్మరణీయమని చెప్పారు.
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ గారి మృతి బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
జర్నలిస్టుగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా , తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా తనదైన ముద్ర వేశారు.
బీఆర్ఎస్ పార్టీకి వారి సేవలు చిరస్మరణీయం. సత్తన్న గారి… pic.twitter.com/ssA59VObwM— Harish Rao Thanneeru (@BRSHarish) January 26, 2025
సత్యనారాయణ మృతిపట్ల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణ పాత్ర మరువలేనిదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

