చౌటకూర్, ఏప్రిల్16: సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్ గ్రామ శివారులో నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో కళాకారులు ఆడిపాడారు.
తెలంగాణ పోరాటం, బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, తెలంగాణ సంస్కృతిపై ధూంధాంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కళాకారులు సభకు వచ్చిన ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపారు.