ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నది : పుట్ట మధుకర్
మంథని ఏఎంసీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు.
మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ఏఎంసీలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. గురువారం మంథని ఏఎంసీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధాన్యాన్ని ప్రైవేటుగా రూ. 3000 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని సీఎం అనడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రభుత్వమే దళారులను ప్రోత్సహిస్తూ రైతులను ఆగం చేయాలని చూస్తున్నది. మంథనిలో రూ. 2500లకు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదనడానికి ఏఎంసీలో ఉన్న ధాన్యమే నిదర్శనమన్నారు. ఏఎంసీలో ఉన్న ధాన్యం కుప్పలను కొంగలకు ఆహారంగా మారుతున్నాయి.
సీఎంకు భజన చేస్తున్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రజలను చులకన చేయడం బంద్ చేయాలన్నారు. భారత రాజ్యాంగాన్ని అవమానించే పార్టీ.. ఓవైపు కోతలతో దోపిడీ చేస్తూ ఇప్పుడు దళారులను రైతుల మీదకు పంపిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంథనిలో అభివృద్ధిని విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి శ్రీధర్ బాబు అధికారం, పదవులు, డబ్బు సంపాదించిన ధ్యేయంగా పనిచేస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరుచి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించడంతోపాటు రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నది : పుట్ట మధుకర్
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ టీజర్ వచ్చేసింది.. డిసెంబర్ 11న గ్రాండ్‌గా రిలీజ్!
Jammu Kashmir: కశ్మీర్లో ఎస్పీవోలు అదృశ్యం.. బుల్లెట్ గాయాలతో మృతదేహాలు లభ్యం
1000 Drums Wangala Festival | 1000 డ్రమ్స్ వంగాలా ఫెస్టివల్‌ను చూశారా..? వీడియో
Volga Videos | వోల్గా వీడియోస్ వ్యవస్థాపకుడి క్రెడిట్ కార్డు నుంచి రూ.34.44 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

