Errabelli | మూడు విడతల్లో 40 శాతం మందికే రుణమాఫీ : మాజీ మంత్రి ఎర్రబెల్లి
Errabelli | మూడు విడతల్లో రాష్ట్రంలో 40 శాతం మందికే రుణమాఫీ(Loan waiver) జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli) మండిపడ్డారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.
మహబూబాబాద్ : మూడు విడతల్లో రాష్ట్రంలో 40 శాతం మందికే రుణమాఫీ(Loan waiver) జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli) మండిపడ్డారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్టదని..రేవంత్‌రెడ్డివి పుటకో మాట మాట్లాడుతాడని అన్నారు. రూ. 49వేల కోట్లని చెప్పి.. 17కోట్లతో సరిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..రుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదని అధికార కాంగ్రెస్ మంత్రులే అంటుంటే రేవంత్ రెడ్డికి సిగ్గులేదన్నారు.
ఆయనకు అన్ని దేవుళ్ల మీద ఒట్లు తప్ప.. ప్రజల సంక్షేమం పట్టదని పేర్కొన్నారు. హరీశ్‌రావు సవాల్ భయంతోనే రుణమాఫీ మొదలు పెట్టారన్నారు. ఖమ్మం సభలో పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందనడం రేవంత్ రెడ్డి తెలివి తక్కువతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటిమాటికి మాట మార్చి రైతులను మోసం చేస్తోందని విమర్శించారు.
రుణమాఫీ కాక ఆందోళనలో ఉన్న లక్షలాది మంది రైతులకు అండగా ఉంటామన్నారు. ఆరు కాలం కష్టపడి పండించిన రైతుకు ఈ ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూస్తూనే ఉందని, కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

