Telangana | నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత
Telangana | రాష్ట్రంలోని విద్యాలయాల్లో మరోసారి ఫుడ్పాయిజన్ ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు
Telangana | రాష్ట్రంలోని విద్యాలయాల్లో మరోసారి ఫుడ్పాయిజన్ ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వెంటనే విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం9 మంది విద్యార్థులను మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మరో 9 మందిని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫుడ్పాయిజన్కు గురైన ఘటనలో 8 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.
మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు విద్యార్థులకు అన్నం, సాంబారుతో పాటు గుడ్డును వడ్డించారు. అయితే నాసిరకం గుడ్లు, నిత్యవసర వస్తువులతో చేసిన వంటలు తినడం వల్లే విద్యార్థులు తీవ్ర వాంతులతో స్పృహ తప్పిపడిపోయారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. చాలా రోజులుగా పాఠశాలలో విద్యార్థులకు నాణ్యత లేని భోజనాన్ని వడ్డిస్తున్నారని తెలిపారు.
కాగా.. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాగనూరు ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్య చికిత్సలను అందించాలని సూచించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిని ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని మాగనూరు ఎస్సైను ఎమ్మెల్యే ఆదేశించారు.
బ్రేకింగ్ న్యూస్
పాపం పసి పిల్లలు
ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
8 మంది పరిస్థితి విషమం.. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
నారాయణపేట – మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
మండల పరిధిలోని జిల్లా పరిషత్… https://t.co/lub6vp5Zm5 pic.twitter.com/cMPc2BAwLC
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2024

Food Poison2

Food Poison3

Food Poison4
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

