సర్ నోటీసుల పరిషారంలో వెసులుబాటు.. ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు సీఈవో ఆదేశాలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-2026)లో భాగంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, విదేశాల్లో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసుల పరిషారంలో భారత ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది.
- వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్న ఓటర్ల తరఫున కుటుంబసభ్యుల హాజరుకు అనుమతి
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-2026)లో భాగంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, విదేశాల్లో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసుల పరిషారంలో భారత ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. వారి తరఫున వయోజన కుటుంబసభ్యులు సంబంధిత ఎన్నికల అధికారుల ఎదుట వ్యక్తిగతంగా హాజరై అవసరమైన పత్రాలు, సమాచారాన్ని సమర్పించేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం మెమో జారీ చేశారు.
జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్రంలోని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఈ ఆదేశాలు పంపారు. వారు సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (ఏఈఆర్వోలు) తగిన సూచనలు ఇవ్వాలని పేరొన్నారు. నోటీసుల జారీ, వాటి పరిషారానికి అనుసరిస్తున్న విధానాన్ని ఈఆర్వోలు, ఏఈఆర్వోలు వారానికోసారి నిర్వహించే రాజకీయ పార్టీల సమావేశాల్లో వివరించాలని సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు సంబంధించిన పత్రాలు, సమాచారాన్ని వారి తరఫున వయోజన కుటుంబసభ్యులు సమర్పించే విధానంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- AERO
- CEO C Sudarshan Reddy
- ERO
- GHMC
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

