Environmental Protection | మట్టి గణనాథులతో పర్యావరణ పరిరక్షణ
Environmental Protection | పర్యావరణ పరిరక్షణకు నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మాలేగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించేలా వినూత్న కార్యక్రమం చేపట్టారు.
కుభీర్: పర్యావరణ పరిరక్షణకు ( Environmental Protection ) నిర్మల్ జిల్లా కుభీర్ ( Khubeer) మండలంలోని మాలేగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించేలా వినూత్న కార్యక్రమం చేపట్టారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శేషోళ్ల మహేష్ ( Teacher Mahesh ) పలువురు విద్యార్థులచే మట్టి గణనాథుల విగ్రహాలను ( Ganesha Idols ) తయారు చేయించి, వాటిని గ్రామ ప్రజలకు పంపిణీ చేయించారు.
వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి మేలు చేకూరుతుందని, రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారయ్యే విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులకు వివరించారు.
ప్రకృతి పరిరక్షణ, నీటి కాలుష్య నివారణ వంటి అంశాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు స్వయంగా మట్టి గణనాథులను తయారు చేయడం ద్వారా సృజనాత్మకతతో పాటు పర్యావరణంపై బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన మట్టి గణనాథులను గ్రామ ప్రజలకు పంపిణీ చేయడంతో పలువురు అభినందించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

