చైనా మాంజా అమ్మితే ఐదేండ్ల జైలు
: రాష్ట్రంలో నిషేధిత చైనా మాంజాలు అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసినా ఐదేండ్లు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) డోబ్రియాల్ హెచ్చరించారు.
- లక్ష రూపాయల జరిమానా
- తనిఖీలకు ప్రత్యేక బృందాలు
- పీసీసీఎఫ్ డోబ్రియాల్
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిషేధిత చైనా మాంజాలు అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసినా ఐదేండ్లు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) డోబ్రియాల్ హెచ్చరించారు. వీటి విక్రయాలు జరుగకుండా ఐదు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని, చైనా మాంజాను రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. దీనిపై బుధవారం హైదరాబాద్ అరణ్యభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు.
చైనా మాంజా వినియోగం వల్ల మనుషులు, పక్షులకు హాని జరిగితే 3 నుంచి 7 ఏండ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటుందని డోబ్రియాల్ అన్నారు. ‘పతంగులతోపాటు పక్షులనూ ఎగరనిద్దాం’ అన్న నినాదంతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని సూచించారు. చైనా మాంజాలకు బదులు సంప్రదాయ కాటన్ దారాలు వాడాలని.. ఎక్కడైనా చైనా మాంజాలు విక్రయిస్తున్నట్టు తెలిస్తే అటవీశాఖ టోల్ ఫ్రీ నంబర్లు 040-23231440, 18004255364 సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

