Shadnagar | వలస బతుకులు తునాతునకలు.. షాద్‌నగర్ గ్లాస్ ఫ్యాక్టరీలో కంప్రెషర్ పేలి ఐదుగురు కూలీల దుర్మరణం
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం చింతగూడ పంచాయతీ పరిధిలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం గ్యాస్ కంప్రెస్ చేస్తుండగా కంప్రెషర్ పేలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
- షాద్‌నగర్ గ్లాస్ ఫ్యాక్టరీలో దుర్ఘటన..15మందికి గాయాలు
- బాధితులంతా ఒడిశా, బీహార్, యూపీకి చెందిన కూలీలు
- మెదక్‌లో లారీలు ఢీకొని ఐదుగురు ఎంపీ వాసులు మృతి
Shadnagar | రంగారెడ్డి, జూన్ 28(నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం చింతగూడ పంచాయతీ పరిధిలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం గ్యాస్ కంప్రెస్ చేస్తుండగా కంప్రెషర్ పేలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. దవాఖానలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతులు, క్షతగాత్రులంతా యూపీ, బీహార్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించా రు. గాయపడ్డవారికి షాద్‌నగర్, శంషాబాద్‌లోని హాస్పిటళ్లలో చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం సమయంలో సుమారు 200 మంది కార్మికులు డ్యూటీలో ఉన్నారు. బీహార్ రాష్ర్టానికి చెందిన చిత్తరంజన్(31), రాంప్రకాశ్ (31), యూపీకి చెందిన నిఖిత్కుమార్ (22), ఒడిశాకు చెందిన రతికాంత్(25) అ క్కడికక్కడే మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్సేత్(24) శంషాబాద్‌లోని ఆసుపత్రిలో చనిపోగా మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్ శశాంక, డీసీపీ రాజేశ్ పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మెరుగైన వైద్యం అందించాలి : సీఎం
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌కు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో వెంటనే సహాయకచర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
సౌత్‌గ్లాస్ పరిశ్రమ ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృ తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సానుభూతి తెలిపారు.
రెండు లారీలు ఢీకొని ఐదుగురి దుర్మరణం
చేగుంట, జూన్ 28: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. నాగ్‌పూర్ నుంచి 450 మేకల లోడ్‌తో హైదరాబాద్ వెళ్తున్న లారీ, మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపాస్ రోడ్డులో ముందుగా వెళ్తున్న లారీని వేగంగా ఢీకొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఎండీ ఇబ్రహీం (21), చిక్వ రాజు (57), చిక్వ మనీశ్ (30), ఎండీ షబ్బీర్‌ఖాన్ (48), ఎండీ జిసన్ (21) దుర్మరణం చెందగా రమేశ్, మహేశ్, శుక్లా ల్, లాల్‌మని, బుట్టాసింగ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ దవాఖాన కు తరలించారు. వందకుపైగా మేకలు మృ త్యువాతపడ్డాయి. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్టు చేగుంట ఎస్సై తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

