Fish Food Festival | పండుగ వాతావరణంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ : మంత్రి తలసాని
Fish Food Festival | వచ్చే నెలలో మృగశిర కార్తె సందర్బంగా ఫిష్ పుడ్ ఫెస్టివల్(Fish Food Festival ) ను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది.
హైదరాబాద్ : వచ్చే నెలలో మృగశిర కార్తె సందర్బంగా ఫిష్ పుడ్ ఫెస్టివల్(Fish Food Festival ) ను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. మత్స్యశాఖ ఆధ్వరంలో జూన్ 8,9,10 తేదీలలో అన్ని జిల్లా కేంద్రాలలో ఈ ఫెస్టివల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) బుధవారం బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మత్స్య శాఖ అధికారులతో సమీక్ష(Review) నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ ఫిష్ పుడ్ ఫెస్టివల్ నిర్వహణకు అనువైన ప్రాంతాలను గుర్తించి ఏర్పాట్లు (Arrangements)చేయాలని అన్నారు. ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లో చేపలతో తయారు చేసిన ఫిష్ ఫ్రై(Fish Fry), కర్రీ(Curry), బిర్యానీ(Biryani) వంటి అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించే ఫెస్టివల్ లో 20 నుంచి ౩౦ వరకు వివిధ రకాల చేప వంటకాల స్టాల్స్ ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ప్రతి చోట విజయ డెయిరీ ఉత్పత్తులతో (Diary Products)కూడిన స్టాల్ ను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభానికి ఆయా జిల్లాలకు చెందిన మంత్రిని , ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఫెస్టివల్ కు వచ్చే వినియోగదారులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలను(Cultural Programmes) నిర్వహించాలని చెప్పారు. రాష్ట్ర పండుగను తలపించే విధంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ అధికారులతో పాటు గోపాలమిత్ర లకు కూడా భాగస్వాములను చేయాలని అన్నారు.
అదేవిధంగా మత్స్యరంగానికి విశేష సేవలు అందించిన వారిని గుర్తించి సన్మానించాలని తెలిపారు. నూతనంగా లక్ష మందికి మత్స్య సొసైటీ లలో సభ్యత్వాలు కల్పించే విధంగా స్పెషల్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఫిష్ పుడ్ ఫెస్టివల్ నిర్వహణ, ఏర్పాట్లపై పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా పాల్గొన్నారు. నూతనంగా మత్స్య సహకార సంఘాల సొసైటీ చైర్మన్ గా నియమితులైన పిట్టల రవీందర్ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయన ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

