కోకాపేట లో వేలానికి భారీ లేఅవుట్
కోకాపేట | హైదరాబాద్ శివారులోని కోకాపేటపై ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ కోకాపేటలో భారీ లేఅవుట్‌కు ప్రభుత్వం రంగం

- తొలివిడత 70.15 ఎకరాల మేర 9 ప్లాట్లు
- మలివిడతలో 35.15 ఎకరాల మేర 6 ప్లాట్లు
- ఔటర్ మీదుగా తొలిసారి ట్రంపెట్ నిర్మాణం
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 30 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ విమానాశ్రయం.. ఔటర్ రింగ్ రోడ్డు.. ఐటీ కారిడార్.. ఇలా సకల సౌకర్యాలకు అందుబాటులో ఉన్న హైదరాబాద్ శివారులోని కోకాపేటపై ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ కోకాపేటలో భారీ లేఅవుట్‌కు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. 105.30 ఎకరాల విస్తీర్ణాన్ని కేవలం 15 ప్లాట్లుగా విభజించింది. అంతర్జాతీయస్థాయిలో చేపట్టనున్న ఈ- వేలంలో తొలివిడతలో 70.15 ఎకరాల విస్తీర్ణం మేర 9 ప్లాట్లను వేలం వేయనుండగా, మలివిడతలో 6 ప్లాట్లను వేలానికి సిద్ధంచేస్తున్నారు.
మునుపెన్నడూ లేనివిధంగా ఈ లేఅవుట్లలో పెద్దఎత్తున రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు, ఆపై శంషాబాద్ విమానాశ్రయం, ఐటీ కారిడార్‌ను అనుసంధానించేందుకు కనీసం 100 ఫీట్లు (30 మీటర్లు) మొదలు 120, 150 ఫీట్ల విస్తీర్ణంలో రహదారులను అభివృద్ధి చేస్తుండటం విశేషం.
తొలిసారిగా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ట్రంపెట్ నిర్మాణాన్ని చేపట్టనున్నారంటే కోకాపేట ప్రాంత ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు ఔటర్‌పై నార్సింగి వద్ద ఇంటర్ చేంజ్ నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు. ఇలా రవాణా సహా అధునాతన మౌలిక వసతులను రూ.280 కోట్లతో చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ పనులు శర వేగంగా సాగుతున్నాయి.
ఇవీ కూడా చదవండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

