Fire Accident | హెటిరో ల్యాబ్స్‌లో అగ్ని ప్రమాదం.. !
Fire Accident | సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం వద్ద గల హెటిరో ల్యాబ్స్‌లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది.
Fire Accident | సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం వద్ద గల ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో ల్యాబ్స్‌లో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదని తెలుస్తున్నది. అయితే కంపెనీకి భారీగా నష్టం జరిగినట్లు అధికార వర్గాల కథనం.
ఇక ల్యాబ్ నుంచి భారీగా మంటలు ఎగసి పడుతుండటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకున్నది. ఒక్కసారిగా మంటలు ఎగసి పడుతుండటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ సమాచారం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్న అగ్ని మాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పివేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, హెటిరో ల్యాబ్స్ యాజమాన్యం కూడా సొంత అగ్ని మాపక వ్యవస్థలతో మంటలు ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. అయితే, హెటిరో ల్యాబ్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణాలు తెలియరాలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

