Vinod Kumar | కులవృత్తులను ఆదుకోవడం కోసమే ఆర్థిక సహాయం : వినోద్‌కుమార్
Vinod Kumar | వెనకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి(Financial Development) కోసం మొదటి మెట్టుగా బీసీ బంధును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు(Planning Board Vice Chairman) బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
వేములవాడ(సిరిసిల్ల ) : వెనకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి(Financial Development) కోసం మొదటి మెట్టుగా బీసీ బంధును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు(Planning Board Vice Chairman) బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్ లో శుక్రవారం సంక్షేమ సంబురాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అక్కడే ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన తరగతుల వారికి ఒక్కొక్కరికి బీసీ బంధు(BC Bandu) కింద లక్ష రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందని వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2002లో కేసీఆర్ (KCR)నాయకత్వంలో దళిత పాలసీని ముందుగానే ప్రకటించామని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్నామని తెలిపారు. గోదావరి, కృష్ణ నదులను మళ్లించి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు. రైతులకు ఎకరానికి రూ. 10 వేల పంట పెట్టుబడి సాయం ప్రపంచంలో మరెక్కడా లేదని స్పష్టం చేశారు.
దశాబ్ది ఉత్సవాలు జరుపుకునేట్లుగానే వచ్చే పదేళ్ల వరకు చేయవలసిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కరీంనగర్ వాసులు హైదరాబాద్‌లాంటి నగరాలకు వెళ్లకుండా స్థానికంగానే ఆసుపత్రులను నెలకొల్పుతూ వైద్యసేవలను అందుబాటులో ఉంచారని వెల్లడించారు.
కార్యక్రమంలో కలెక్టర్ అమరాగ్ జయంతి, ఎమ్మెల్యే రమేశ్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీలు భూర వజ్రమ్మ, బైరగొని లావణ్య, గంగం స్వరూప రాణి, జవ్వాజి రేవతి, ఉమా దేవి, చంద్రయ్య గౌడ్, జడ్పీటీసీలు మ్యకల రవి, గట్ల మీనయ్య, నాగం భూమయ్య, మాజీ మార్కె ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి, అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

