హే.. బాపూ..
జాతిపిత మహాత్మాగాంధీని అఖిల భారత హిందూ మహాసభ అసురుడిగా చిత్రీకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్మీడియాలో వైరల్ కావడంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
- కోల్కతాలో అసురునిగా మహాత్మాగాంధీ చిత్రీకరణ
- అఖిల భారత హిందూ మహాసభ దుశ్చర్య
- లక్షల ఏండ్లకైనా గాంధీపై గెలవలేరు: కేటీఆర్
కోల్కతా, అక్టోబర్ 3: జాతిపిత మహాత్మాగాంధీని అఖిల భారత హిందూ మహాసభ అసురుడిగా చిత్రీకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్మీడియాలో వైరల్ కావడంలో పోలీసులు కేసు నమోదు చేశారు. దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా నైరుతి కోల్కతాలోని రూబీ క్రాసింగ్ దగ్గర అఖిల భారత హిందూ మహాసభ నిర్వాహకులు మండపాన్ని ఏర్పాటుచేసి దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆదివారం గాంధీ జయంతి నాడే దుర్గామాత విగ్రహంలోని మహిషాసురుడి స్థానంలో మహాత్ముడిని పోలిన బొమ్మను ఉంచడం వివాదాస్పదమైంది. జాతిపితను అమానించడం అంటే భారత పౌరులందరినీ అవమానించడమేనని టీఎంసీ ధ్వజమెత్తింది. కాగా, నిర్వాహకులు దుర్గాపూజ చేయటం ఇదే తొలిసారి. గతం లో పూజలు నిర్వహించిన దాఖలాలు లేవు.
విశ్వగురువు.. గాంధీజీ : కేటీఆర్
మహాత్మాగాంధీ సిద్ధాంతాన్ని కించపరిచేందుకు స్వయం ప్రకటిత విష గురువులు, గాడ్సేపై ప్రేమ గల వారి శిష్యులు ఎంత ప్రయత్నించినా.. లక్షల ఏైండ్లెనా విజయం సాధించలేరని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. విశ్వగురువుగా ప్రపంచం గుర్తించిన ఏకైక భారతీయుడు మహాత్మాగాంధీ అని గుర్తుచేశారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోల్కతాలో హిందూ మహాసభ ఏర్పాటుచేసిన మండపంలో మహాత్మాగాంధీని దుర్గాదేవి చంపినట్టుగా చిత్రీకరించారని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Filming
- Kolkata
- KTR
- Mahatma Gandhi
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

