గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో సినీ ప్రముఖులు
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో గజల్ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, రచయిత షకీల్ షాయర్ పాల్గొన్నారు. భారత రత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా గ్రీన్ ఇండియా
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో గజల్ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, రచయిత షకీల్ షాయర్ పాల్గొన్నారు. భారత రత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనం పెరిగి.. పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, మానవాళి సురక్షిత జీవనం గడుపుతుందన్నారు.
ప్రకృతికి, సంగీతానికి విడదీయలేని అనుబంధం ఉందని, ఈ రెండింటితోనే మన జీవితాలు సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉంటాయన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ పచ్చదనాన్ని సంతరించుకొని.. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నదన్నారు. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. గ్రీన్ఇండియా చాలెంజ్ కో ఫౌండర్స్ కరుణాకర్ రెడ్డి, రాఘవ పాల్గొని ఎంపీ సంతోష్ కుమార్ వృక్షవేదం పుస్తకాన్ని గజల్ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్, గాయకుడు జస్వీందర్ సింగ్, రచయిత షకీల్ షాయర్కు బహూకరించారు. కార్యక్రమంలో నిర్మాత కొనతం లక్ష్మణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

