మూసాపేట(అడ్డాకుల), మే 15 : ఉపాధి హామీ కూలీపై ఫీల్డ్ అసిస్టెంట్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత ఉపాధి పనులకు వెళ్తున్నది. ఆమెను ఫీల్డ్ అసిస్టెంట్ రాజునాయక్ కొంత కాలంగా వేధిస్తున్నాడు. శుక్రవారం సదరు మహిళను కొత్త పంచాయతీ భవనాన్ని శుభ్రం చేయాలని పంపించాడు. రాజునాయక్ అక్కడికి వెళ్లి ఆమెపై లైంగికదాడి చేశాడు. ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.