కూతురిని కాపాడబోయి..
ఎల్ఎండీ అందాలను తిలకించేందుకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం నిండింది. ప్రమాదవశాత్తూ నీటిలో పడ్డ కూతురిని కాపాడబోయి తండ్రి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో చోటుచేసుకున్నది.
- ఎల్ఎండీలో మునిగి తండ్రి మృతి
- అక్క, నాన్న కోసం దూకిన కొడుకు
- ముగ్గురూ మునగడంతో కేకలు
- పిల్లలను కాపాడిన మత్స్యకారుడు
తిమ్మాపూర్, జూన్ 17: ఎల్ఎండీ అందాలను తిలకించేందుకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం నిండింది. ప్రమాదవశాత్తూ నీటిలో పడ్డ కూతురిని కాపాడబోయి తండ్రి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో చోటుచేసుకున్నది. కరీంనగర్‌లోని సంతోష్‌నగర్‌లో నివాసం ఉండే బంగారి విజయ్‌కుమార్ (47) కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లో వర్క్స్, ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెం ట్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్. సోమవారం సెలవుకావడంతో భార్య ప్రశాంతి, కూతురు సాయినిత్య, కొడుకు విక్రాంత్, అత్త పుష్పలతతో కలిసి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని పొట్లపల్లి శివాలయానికి వెళ్లారు. తిరిగి వస్తూ ఎల్ఎండీ రిజర్వాయర్ ను చూసేందుకు వెళ్లారు. కట్టపై నుంచి డ్యాంలోకి దిగి లోతుగా ఉండే కాకతీయ కాలువలోకి నీళ్లు వె ళ్లే ప్రాంతంలో సరదాగా గడిపారు. బీటెక్ ఫస్టియ ర్ చదివే కూతురు సాయినిత్య సెల్ఫీలు దిగు తూ అదుపుతప్పి నీళ్లలో పడిపోయింది. తం డ్రి నీళ్లలోకి దూకి కాపాడేందుకు ప్రయత్నిస్తూ మునిగిపోయారు. వారి కోసం టెన్త్ చదివే కొ డుకు విక్రాంత్ సైతం దిగాడు. ముగ్గురూ ము నిగిపోతుండటంతో కుటుంబసభ్యులు కేకలు వేశారు. సమీపంలో ఉన్న మత్స్యకారుడు శ కర్ వెంటనే వచ్చి నీటిలోకి దిగి పిల్లలను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. విజయ్ గల్లంతయ్యాడు. కొద్దిసేపటికే మృతదేహం పైకితేలి దొరికింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

