Road Accident | యాదాద్రి భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Road Accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Road Accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు డివైడర్ ఢీ కొట్టి.. విజయవాడ వైపు వెళ్తున్న కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. సాయికుమార్ (33)తో పాటు ఐదునెలల బాలుడు వీర్షాన్ మృతి చెందాడు. ముగ్గురు సభ్యులు హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా.. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లలో మొత్తం ఆరుగు ప్రయాణికులు ఉన్నారు. గాయపడ్డ వారిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

