జొన్నలో తరుగుపై ఆగ్రహం
కొనుగోలు కేంద్రంలో తరుగుపేరిట చేస్తున్న దోపిడీని నిరసిస్తూ జొన్న రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శనివారం రాస్తారోకో చేశారు. తరుగు పేరుతో దోచుకుంటున్నారని, హమాలీలు, లారీ డ్రైవర్లు కూడా పైసలు ఇస్తేనే కాంటాలు వేయడం, తరలించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
- కామారెడ్డి జిల్లాలో రైతుల రాస్తారోకో
బాన్సువాడ, మే 25 : కొనుగోలు కేంద్రంలో తరుగుపేరిట చేస్తున్న దోపిడీని నిరసిస్తూ జొన్న రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శనివారం రాస్తారోకో చేశారు. తరుగు పేరుతో దోచుకుంటున్నారని, హమాలీలు, లారీ డ్రైవర్లు కూడా పైసలు ఇస్తేనే కాంటాలు వేయడం, తరలించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతను ప్రభుత్వం నట్టేట ముంచుతున్నదని, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని నినదించారు.
కొనుగోలు కేంద్రంలో తరుగు పేరిట చేస్తున్న దోపిడీని నిరసిస్తూ జొన్న రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రంలో తరుగు పేరుతో దోచుకుంటున్నారని, చివరకు హమాలీలు, లారీ డ్రైవర్లు సైతం పైసలు ఇస్తేనే బస్తాలు కాంటా వేయడం, తరలించడం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అన్నదాతలను నట్టేట ముంచుతున్నదని, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. అకాల వర్షాలతో తీవ్ర నష్టం జరిగితే ఆదుకోవాల్సింది పోయి ఇలా దోచుకోవడం ఏమిటని నిలదీశారు. గతంలో మార్కెట్ యార్డులో ఎప్పుడూ తరుగు తీయలేదని, ఇప్పుడే కొత్తగా తరుగు అంటున్నారని మండిపడ్డారు. పూర్తిగా ఎండిన జొన్నలు తీసుకొచ్చామని, తరుగు ఎందుకు తీస్తున్నారని మార్కెట్ సిబ్బందిని అడిగితే, పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారన్నారు. రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం సరికాదన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

