Rythu Bandhu | వెంచర్ల రైతుబంధు వాపస్.. ప్రభుత్వ చర్యలతో రైతుల్లో ఆందోళన
వ్యవసాయేతర భూములకు గతంలో రైతుబంధు పథకం కింద అందజేసిన పెట్టుబడి సాయాన్ని వాపస్ తీసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతున్నది.
- మేడ్చల్ జిల్లాలో రైతుకు నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం
- వెంచర్ చేసిన భూమికి 16 లక్షలు పొందినట్టు నిర్ధారణ
- ఆ మొత్తాన్ని రికవరీ చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం
- రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర భూములపై ప్రభుత్వం సర్వే
- సాగులోలేని భూములకు 25 వేల కోట్లు ఇచ్చినట్టు గుర్తింపు
- రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి రివకరీ ఉంటుందా?
- రైతుబంధు వెనక్కి తీసుకునే చర్యలతో రైతుల్లో ఆందోళన
Rythu Bandhu | హైదరాబాద్/మేడ్చల్, జూలై 11(నమస్తే తెలంగాణ): వ్యవసాయేతర భూములకు గతంలో రైతుబంధు పథకం కింద అందజేసిన పెట్టుబడి సాయాన్ని వాపస్ తీసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతున్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం గ్రామానికి చెందిన రైతు మోత్కుపల్లి యాదగిరిరెడ్డికి గతంలో అందజేసిన రైతుబంధును వాపస్ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా కలెక్టర్ అనుమతితో రెండు రోజుల్లో ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్టు ఘట్కేసర్ తహసీల్దార్ రజిని తెలిపారు. పోచారం గ్రామానికి చెందిన రైతు యాదగిరిరెడ్డికి అదే గ్రామంలోని సర్వే నంబర్ 38, 39, 40లో 33 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని ఆయన గతంలో లేఅవుట్‌గా చేసి విక్రయించారు.
ఈ భూమికి కూడా రైతుబంధు అందినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో జిల్లా కలెక్టర్ గౌతమ్ విచారణకు ఆదేశించారు. సదరు రైతు లేఅవుట్ చేసిన భూమికి రైతుబంధు కింద మొత్తంగా రూ.16 లక్షలు తీసుకున్నట్టు విచారణలో నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని రికవరీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే, వ్యవసాయానికి అనుగుణంగా లేని భూమితోపాటు లే అవుట్ చేసిన భూములకు రైతుబంధును అధికారులు ఎలా ఇచ్చారన్న విషయమై రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు.
లే అవుట్ భూమికి పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఎలా వచ్చాయన్న కోణంలో విచారణ చేపట్టారు. అయితే, ఇలాంటి నోటీసులు యాదగిరిరెడ్డికి మాత్రమే పరిమితమవుతాయా? రాష్ట్రంలోని రైతులందరికీ నోటీసులు ఇస్తారా? అనే చర్చ జరుగుతున్నది. ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇస్తామని ఆశ పెట్టిన కాంగ్రెస్.. అవి ఇవ్వకపోగా, గతంలో ఇచ్చినవాటిని కూడా వెనక్కి తీసుకోవడం దారుణమని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
వ్యవసాయేతర భూములపై ప్రభుత్వం సర్వే
రైతుబంధు పథకాన్ని రైతుభరోసాగా మార్చిన కాంగ్రెస్ సర్కారు.. కొత్త నిబంధనలు అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. గత ప్రభుత్వం సాగులోలేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చి ప్రజాధనాన్ని వృథా చేసిందంటూ కోతలు పెట్టేందుకు సిద్ధమైంది. ఐదెకరాలు లేదా పదెకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఆదాయపుపన్ను చెల్లించే వారికి కోత పెట్టాలని, సాగులో ఉన్న భూమికి మాత్రమే ఇవ్వాలని భావిస్తున్నది. జిల్లాలవారీగా రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నది.
మరోవైపు, ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పొందినటువంటి సాగులో లేని, వ్యవసాయేతర భూములపై సర్వే నిర్వహించింది. గడిచిన ఆరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.80,453 కోట్లను రైతుబంధు పెట్టుబడి సాయంగా రైతులకు అందజేసింది. ఇందులో సుమారు రూ.25 వేల కోట్ల నిధులను వ్యవసాయేతర భూములకు చెల్లించినట్టు కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి భూములకు రైతుభరోసాలో కోత పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా భూములకు గతంలో ఇచ్చిన మొత్తాన్ని కూడా రైతుల నుంచి రికవరీ చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.
యాదగిరిరెడ్డికి నోటీసులు ఇచ్చేదెలా?
పోచారంలో వ్యవసాయ భూమి పేరిట రైతుబంధు నగదు పొందిన రైతు యాదగిరిరెడ్డికి నోటీసులు ఎలా ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రసుత్తం యాదగిరిరెడ్డి పోచారంలో అందుబాటులో లేరు. సమాచారం ఇచ్చేందుకు ఆయన ఫోన్ నంబర్ కూడా అధికారులకు లభించడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు ఎలా అందజేస్తారు? రెతుబంధు నగదును ఎలా రికవరీ చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
రెండు రోజుల్లో రైతుకు నోటీసులు ఇస్తాం
పోచారం గ్రామానికి చెందిన రైతు యాదగిరిరెడ్డి లేఅవుట్లు చేసి విక్రయించిన భూములకు రూ.16 లక్షలు రైతుబంధు తీసుకున్నట్టు తేలింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని నిర్ణయించాం. సదరు రైతుకు కలెక్టర్ అనుమతితో రెండు రోజుల్లో నోటీసులు జారీ చేస్తాం. మిగిలిన భూములపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.
– రజిని, తహసీల్దార్ ఘట్కేసర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

