అడవి పంది దాడిలో రైతు మృతి
అడవి పంది దాడిలో రైతు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా దేవగిరిపట్నంలో బుధవారం ఉదయం జరిగింది. దేవగిరిపట్నం గ్రామానికి చెందిన రైతు వెంకట్‌రెడ్డి(65) కార్తిక పౌర్ణమి సందర్భంగా తన భార్య ధనమ్మను బైక్‌పై తీసుకెళ్లి శివాలయం వద్ద దింపాడు. అక్కడి నుంచి నేరుగా తన పత్తి చేను వద్దకు వెళ్లాడు.
- ములుగు జిల్లా దేవగిరిపట్నంలో ఘటన
ములుగురూరల్, నవంబర్ 5 : అడవి పంది దాడిలో రైతు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా దేవగిరిపట్నంలో బుధవారం ఉదయం జరిగింది. దేవగిరిపట్నం గ్రామానికి చెందిన రైతు వెంకట్‌రెడ్డి(65) కార్తిక పౌర్ణమి సందర్భంగా తన భార్య ధనమ్మను బైక్‌పై తీసుకెళ్లి శివాలయం వద్ద దింపాడు. అక్కడి నుంచి నేరుగా తన పత్తి చేను వద్దకు వెళ్లాడు. పంటను పరిశీలిస్తున్న క్రమంలో వెంకట్‌రెడ్డిపై అడవి పంది దాడి చేసింది.
కింద పడిన వెంకట్‌రెడ్డిని ఎడమచేయి భుజం, చేతులు కొరికి తీవ్రంగా గాయపర్చింది. వెంటనే లేచి పరుగెత్తుతుండగా మళ్లీ దాడి చేయగా, తప్పించుకునే క్రమంలో పక్కనే ఉన్న నీటికుంటలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో అందులో మునిగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

